తెలంగాణ లో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా? | How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu?

తెలంగాణ లో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా?(How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu) ,కావలసిన డాకుమెంట్స్ ,స్లాట్ బుకింగ్ ,ఫీజు వివరాలు  , అప్లికేషను ,అధికారిక వెబ్సైటు ,( How To Apply Learning Licence In Telangana?),( required documents, slot booking, Fee details , application , official website )

తెలంగాణ లో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చెయ్యడం ఎలా  అనేది తెల్సుకోవాలి అంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవాలి.ఇందులో వివరించిన స్టెప్స్ ఫాలో అయితే మీ పని విజయవంతం గా పూర్తి అవుతుంది 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏమిటి ?(What is Learning Licence In Telangana)

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక ధ్రువపత్రం. ఈ పత్రం ద్వారా మనం వెహికల్స్ ని రోడ్డు మీద అధికారికంగా నడపవచ్చు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కి ఒక పరీక్ష. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తరువాత ఆరు నెలల సమయంలో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తరువాత ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్  నిర్వహించడం చేయడం జరుగుతుంది. ఇలా నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్కు హాజరయ్యి మనం డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిన తరువాత ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మాత్రమే మనము అధికారికంగా వెహికల్స్ ను నడపాలి లేనియెడల మన మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగాలు (Learning Licence Uses )

  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది
  •  లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి మీరు రోడ్డు మీద డ్రైవ్ చేయడాన్ని నేర్చుకోవచ్చు 
  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా  మీరు  మీ వెహికల్ ని తీసుకొని రోడ్డుమీద ప్రయాణం చేయవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ట్రాఫిక్ నియమ నిబంధనలు  ఉల్లంఘించినా  లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం ద్వారా మీరు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు (Learning Licence)

పత్రం (సర్టిఫికేట్ )లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ 
పత్రం ఇచ్చువారు తెలంగాణ ప్రభుత్వం
అర్హులు 16 years above
ఉపయోగం డ్రైవింగ్ పర్మిట్ 
అధికారిక వెబ్ సైట్tgtransport.net
లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు 300/-

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు (Learning Licence Slot Booking Documents)

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కి కావలసిన పత్రాలను ఇక్కడ చూడవచ్చు 

  1. ఆధార్ కార్డు 
  2. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ / 10 th సర్టిఫికేట్ 
  3. అడ్రస్ ప్రూఫ్ 
  4. పాస్పోర్ట్ సైజు ఫోటో డిజిటల్ కాపీ (అప్లోడ్ చెయ్యడానికి )
  5. వ్యక్తి డిజిటల్ సైన్ (అప్లోడ్ చెయ్యడానికి )

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు వివరాలు

 లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్  దరఖాస్తు చేయడానికి  ఫీజుగా  300 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది

  • అప్లికేషన్ ఫీజు 150 రూపాయలు గా తీసుకుంటారు
  • టెస్ట్ ఫీజు 50 రూపాయలు
  •  సర్వీస్ ఛార్జ్ 100 రూపాయలు 
  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫీజు మొత్తం కలిపి 300 రూపాయలు 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు విధానం (How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu)

  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్  కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తరువాత స్లాట్ బుక్ చేసుకున్న రోజు ఆర్టీఎ ఆఫీస్ కి వెళ్లి మీ యొక్క ధ్రువపత్రాలను వెరిఫికేషన్ కోసం చూపించవలసి ఉంటుంది ఆ తర్వాత అదే రోజు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ పరీక్షను రాయవలసి ఉంటుంది ఆ పరీక్షలో పాస్ అయినట్లయితే మీకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఆ పరీక్షల్లో ఫెయిల్ అయితే 30 రోజుల తర్వాత మళ్లీ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కు ధరఖాస్తు చెయ్యడానికి ఈ క్రింది విధమైన స్టెప్స్ పాటించవలసి ఉంటుంది 

  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రిటర్న్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది అందుకోసం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 1
  • అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ మెనూలో లైసెన్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అందులో లెర్నింగ్ లైసెన్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 2
  •  లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 3
  • తర్వాత కంటిన్యూ అండ్ అగ్రి అనే రెండు ఆప్షన్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 4
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 5
  • ఆన్లైన్ లెర్నింగ్ లైసెన్స్ స్మార్ట్ బుకింగ్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మీ డిస్టిక్ పేరు మరియు టెస్ట్ సెంటర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 6
  • తరువాత  షెడ్యూల్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అందులో ఖాళీగా ఉన్న తేదీలన్నీ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి ఆల్రెడీ బుక్ అయిపోయినటువంటి స్లాట్స్ అన్ని రెడ్ కలర్ లో కనిపిస్తాయి 
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 7
  • అందులో మీకు అనువైన తేదీని ఎంచుకొని దాని మీద క్లిక్ చేస్తే పక్కన సమయానికి సంబంధించినటువంటి బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో సమయాన్ని కూడా క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి 
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 8
  • తరువాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. 
  • అప్లికేషన్ ఫారం లో మీ పేరు మరియు మీ తండ్రి పేరు, మీ ఇంటి పేరు, మీ పుట్టిన తేదీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క పుట్టుమచ్చ వివరాలు  విధిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది తరువాత మీ చిరునామా వివరాలను నింపవలసి ఉంటుంది. ముఖ్యమైనవి మీయొక్క మండలము మరియు మీ యొక్క పిన్కోడ్ పోస్ట్ ఆఫీస్ వంటి వివరాలను కచ్చితంగా నింపవలసి ఉంటుంది ఎందుకంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది పోస్టులో రావడం జరుగుతుంది 
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 9
  • ఇందులో ముఖ్యమైనది డ్రైవింగ్ లైసెన్స్ కేటాగిరిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు దానితోపాటు లైసెన్స్ క్లాస్ అఫ్ వెహికల్ ని ఇక్కడ ఎంచుకోవలసి ఉంటుంది.
  • లైసెన్స్ కేటగిరీని రెండు రకాలుగా విభజించారు ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ రెండు నాన్ ట్రాన్స్ పోర్ట్. మీరు టూ వీలర్ కోసం ఆ లేదా ఫోర్ వీలర్ కోసం అప్లై చేస్తున్నట్లయితే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది
  • లైసెన్స్ క్లాస్ అఫ్ వెహికల్ లో రకాల విభాగాలు ఉంటాయి
  • ఆటో రిక్షా నాన్ ట్రాన్స్పోర్ట్ 
  • అడాప్టర్ వెహికల్
  • లైట్  మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్
  • మోటార్ సైకిల్ వితౌట్ గేర్ 50cc
  • మోటార్ సైకిల్ విత్ గేర్
  •  మోటార్ సైకిల్ వితౌట్ గేర్
  • అదర్స్ క్రేన్
  •  రోడ్ రోలర్ ట్రాన్స్పోర్ట్
  •  ట్రాక్టర్ 
  • ట్రాక్టర్ అండ్ ట్రైలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ 

వంటి  ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి

How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 8

 మీరు  టూ వీలర్ కోసం అప్లై చేసుకుంటున్నాట్లయితే మోటార్ సైకిల్ విత్ కేర్ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు స్కూటీ కోసం అప్లై చేస్తున్నట్లయితే మోటార్ సైకిల్ వితౌట్ గేర్ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోర్ వీలర్ కోసం అప్లై చేస్తున్నట్లయితే  లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది 

  • తర్వాత అప్లికేషన్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది

How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu Application form
  •  సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫ్లాట్ యొక్క వివరాలు మరియు పేమెంట్ ఫీ వివరాలు కనిపిస్తాయి
  •  పేమెంట్ను పే చేసి స్లాట్ బుకింగ్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu step 11
  •  లేదా ప్రింట్ అవుట్ తీసుకొని 24 గంటల్లోపు మీసేవ లో పేమెంట్ చేయవచ్చు
How To Apply For Learning Driving Licence Online In Telangana In Telugu payment fee
  •  ఒకవేళ 24 గంటల లోపు పేమెంట్ చేయనట్లయితే మీ యొక్క స్లాట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ (Learning Licence)

  • లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకొని ఆరోజు వెళ్లి ఆర్టిఏ ఆఫీసులో మీ యొక్క డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ కోసం ఇవ్వవలసి ఉంటుంది.
  • డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసినా తరువాత  లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ ను ఆన్లైన్లో రాయవలసి ఉంటుంది .ఇందులో ముఖ్యంగా 20 నుంచి 30 ప్రశ్నల వరకు అడగడం జరుగుతుంది
  •  ఒకవేళ 20 ప్రశ్నలు ఆన్లైన్ టెస్ట్ లో వచ్చినట్లయితే  మీకు కనీసం 12 మార్కులైన రావలసి ఉంటుంది
  •  ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే మీరు పరీక్ష పాసైనారా లేదా ఫెయిల్ అయినా రా అన్న విషయం  ధ్రువీకరిస్తారు 
  • ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయితే 30 రోజుల తర్వాత మీరు మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
  •  ఒకవేళ మీరు టెస్ట్ పాస్ అయినట్లయితే మీకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ

  • మీకు ఇచ్చినటువంటి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క కాలపరిమితి 6 నెలలుగా నిర్ణయించడం జరుగుతుంది
  •  ఈ ఆరు నెలల్లో మొదటి నెల తరువాత ఎప్పుడైనా మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసి డ్రైవింగ్ టెస్ట్ కోసం రావచ్చు
  •  డ్రైవింగ్ టెస్ట్లో మీరు విజయం సాధిస్తే మీకు డ్రైవింగ్ లైసెన్స్ పోస్టు ద్వారా 14 రోజుల్లో అందజేయడం జరుగుతుంది 

ముఖ్య గమనిక 

ఆర్టిఏ ఆఫీసులో  మీ అప్లికేషన్ కి  జతపరచినటువంటి జిరాక్స్ కాపీలతో పాటు మీయొక్క ఆధార్ కార్డు ఓటర్ ఐడి మరియు బర్త్ సర్టిఫికెట్ మరియు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ల ఒరిజినల్ కూడా మీ వెంట తీసుకుని వెళ్లవలసి ఉంటుంది లేనియెడల  లాయర్  నోటరీ స్టాంప్  కోసం మనల్ని తిప్పించడం  జరుగుతుంది

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ F.A.Q

లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ ఫీజు ఎంత ?

300 rs

Leave a Comment