ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్ అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Praja Palana Application Status in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations,telangana praja palana application status check online,praja palana application status 2024,how to check praja palana application status,)
తెలంగాణ లో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ధరఖాస్తు ఫారాన్ని ప్రజాపాలన ధరఖాస్తు అంటారు ఈ ధరఖాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను అర్హత కలిగిన వారు ఒకే సమయంలో ధరఖాస్తు చేసుకోవడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది .ఆ విధంగా ధరఖాస్తు చేసుకున్నటువంటి వారు వారి యొక్క ధరఖాస్తు యొక్క స్టేటస్‌ను ఆన్లైన్లో చూసుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి స్టేటస్‌ను చూసుకునేలా వీలు కల్పించడం జరిగింది.ప్రజా పాలన ధరఖాస్తు ఏ దశలో ఉంది మీరు అర్హత పొందారా లేదా మీకు ఐదు హామీలలో ఎన్ని హామీలు అమలు చేయడం జరుగుతుంది వంటి వివరాలను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ వివరాలు (Praja Palana Application Status in Telugu)
పథకం | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం |
పథకం నిర్వహణ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం |
పథకం ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ కి చెందిన పౌరులు |
ఉద్దేశ్యం | ఆర్థిక భరోసా కల్పించడం |
అప్లికేషను | MRO ఆఫీస్ |
హెల్ప్ లైన్ నెంబర్ |
ప్రజాపాలన ధరఖాస్తు ఉదేశ్యం
ప్రజాపాలన ధరఖాస్తు ముఖ్య ఉదేశ్యం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఐదు హామీలను అభయహస్తం పథకంలో భాగంగా ఒకే ధరఖాస్తు ద్వారా అర్జీ పెట్టుకోవడానికి అనువుగా ప్రజాపాలన ధరఖాస్తు ఫారాన్ని రూపొందించడం జరిగింది.
. దీని ద్వారా అభయహస్తంలోని ఐదు హామీలకు ఒకేసారి ధరఖాస్తు చేసుకునే వీలుంటుంది అదేవిధంగా ఐదు హామీల లో మీరు దేనికి అర్హులో గుర్తించడానికి ప్రభుత్వానికి కూడా అనువుగా ఉంటుంది ఒక్కసారి మీ అర్హతను నిర్ణయించిన తరువాత ఆ పథకాలలో మీకు వర్తించే పథకాలకు సంబంధించినటువంటి సేవలను మీకు అందించడం జరుగుతుంది
ప్రజాపాలన ధరఖాస్తు లాభాలు
- ప్రజాపాలన ధరఖాస్తు ద్వారా అభయహస్తం ఐదు గ్యారెంటీ పథకాలకు ఒకే సమయంలో ధరఖాస్తు చేసుకోవచ్చు
- ప్రజా పాలన ధరఖాస్తు లు ఐదు రకాల పథకాలకు ధరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది
- అభయ హస్తంలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు లేదా మహిళ కుటుంబానికి నెలకు 2500 ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల గ్యాస్ ను 500 రూపాయలకే అందించడం జరుగుతుంది
- అభయ హస్తంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15000 రూపాయలను అందించడం జరుగుతుంది మరియు రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలను అందించడం జరుగుతుంది
- అభయ హస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు అమరవీరులకు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని అందించడం జరుగుతుంది
- అభయ హస్తంలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించడం జరుగుతుంది
- అభయ హస్తంలో భాగంగా చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్‌ను మరియు వృద్దులకు ,వితంతువులకు ,గీత కార్మికులకు ,చేనేత కార్మికులకు ,డయాలసిస్ బాధితులకు ,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ,బీడీ కార్మికులకు ,పైలేరియా బాధితులకు ,ఒంటరి మహిళలకు ,బీడీ టేకేదారు లకు 4000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది
ప్రజాపాలన ధరఖాస్తు డాకుమెంట్స్
- ప్రజాపాలన ధరఖాస్తు ఇచ్చే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు
- ప్రజాపాలన ధరఖాస్తు ఇచ్చే వ్యక్తి యొక్క నివాస ధృవీకరణ పత్రం
- ప్రజాపాలన ధరఖాస్తు ఇచ్చే వ్యక్తి కుటుంబం యొక్క రేషన్ కార్డు
- మొబైల్ నెంబర్
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్
ప్రజాపాలన ధరఖాస్తు విధానం
- ప్రజాపాలన ధరఖాస్తు కు అప్లై చేసుకుని వారు ఒకవేళ చేసుకున్న చేసుకోవాలనుకుంటే ఈ క్రింది విధానాన్ని పాటించవలసి ఉంటుంది
- ప్రజా పాలనకు సంబంధించినటువంటి ధరఖాస్తు ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి
- మీ పేరు మీ పుట్టిన తేదీ మరియు మీ ఆధార్ నెంబరు రేసర్ నెంబరు మొదలైనటువంటి వివరాలను అప్లికేషన్ లో నింపవలసి ఉంటుంది
- అంతేకాకుండా అభయహస్తం హామీలలో ఏ పథకానికి మీరు ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందించవలసి ఉంటుంది
- తరువాత మీ మండలానికి సంబంధించినటువంటి ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజా పాలన ధరఖాస్తు ఫారాన్ని ఇవ్వవలసి ఉంటుంది
- మీరు ధరఖాస్తు ఫారాన్ని ఇచ్చే సమయంలో వారు ఇచ్చే రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రసీదు మీద ఉన్నటువంటి ధరఖాస్తు ఫారం సంఖ్య ఆధారంగా మీ యొక్క ధరఖాస్తు స్థితిని చూసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ చూసుకునే విధానం (How to check praja palana application status)
- ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- అక్కడ పానల్ లో అప్లికేషను స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యాలి
- అక్కడ మీకు ఇచ్చిన రేసిప్ట్ లో ఉన్న ధరఖాస్తు సంఖ్యని మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
- అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది
ప్రజాపాలన ధరఖాస్తు అప్లికేషన్ డౌన్లోడ్
- ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
- అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది
- దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ప్రజా పాలన ధరఖాస్తు అప్లికేషన్ కోసం ఇక్కడ చూడవచ్చు
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ మొబైల్ చూసుకునే విధానం (Telangana praja palana application status check online)
- ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు ను మీ మొబైల్ లో ఓపెన్ చెయ్యాలి అంటే మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది
- తర్వాత గూగుల్ లో ప్రజా పాలన ధరఖాస్తు స్టేటస్ అని టైప్ చేస్తే అధికారిక వెబ్సైట్ కనిపిస్తుంది
- ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- అక్కడ పానల్ లో అప్లికేషను స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చెయ్యాలి
- అక్కడ మీకు ఇచ్చిన రేసిప్ట్ లో ఉన్న ధరఖాస్తు సంఖ్యని మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
- అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ అధికారిక వెబ్ సైట్ (Praja Palana Application Status 2024 Official Website)
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ హెల్ప్ లైన్ నెంబర్
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
అధికారిక వెబ్సైటు | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
WhatsApp ఛానల్ లింక్ | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ F.A.Q
ప్రజాపాలన ధరఖాస్తు ఎవరు మొదలు పెట్టారు ?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ ఎప్పుడు మొదలు పెట్టారు ?
ప్రజా పాలన ధరఖాస్తు స్టేటస్‌ను త్వరలో తీసుకురానున్నారు
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?
ప్రజాపాలన ధరఖాస్తు స్టేటస్ యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది
Other Schemes of Telangana