గృహలక్ష్మి పథకం తెలంగాణ వివరాలు 2023 (Gruhalakshmi Scheme Telangana in Telugu)

గృహలక్ష్మి పథకం తెలంగాణ(Gruhalakshmi Scheme Telangana In Telugu), అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ ,గృహలక్ష్మి పథకం దరఖాస్తు,గృహలక్ష్మి అప్లికేషన్,గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం,దరఖాస్తు చివరి తేదీ (Gruhalakshmi Scheme Telangana in Telugu,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో వారికి సొంత ఇంటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన  పథకమే గృహలక్ష్మి పథకం .ఈ పథకం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందిన మహిళలకు వారికి సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే ఇంటి నిర్మాణ ఖర్చుల నిమిత్తం మూడు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది

 గృహలక్ష్మి పథకం తెలంగాణ కు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమిటి మరియు గృహలక్ష్మి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి మరియు దరఖాస్తు యొక్క చివరి తేదీ వంటి వివరాలను ఈ ఆర్థికల్లో వివరించడం జరిగింది 

Table of Contents

గృహలక్ష్మి పథకం తెలంగాణ వివరాలు  (Gruhalakshmi Scheme Telangana in Telugu)

పథకంగృహలక్ష్మి పథకం తెలంగాణ
(Gruhalakshmi Scheme Telangana In Telugu)
పథకం నిర్వహణతెలంగాణ  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది ఆగస్ట్ ,2023 
లబ్దిదారులుSC ,ST,BC కి చెందిన మహిళలు 
ఉద్దేశ్యం3 లక్షలు (గృహ నిర్మాణానికి )
అప్లికేషను ఆన్లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్040 23225018
Gruhalakshmi Scheme Telangana in Telugu

గృహలక్ష్మి పథకం తెలంగాణ ఉదేశ్యం 

గృహలక్ష్మి పథకం తెలంగాణ(Gruhalakshmi Scheme Telangana In Telugu) ముఖ్య ఉదేశ్యం ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు  సొంత ఇంటి కలలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే మహిళలకు సొంత ఇంటి స్థలంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ మరియు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలను అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దానిద్వారా ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి పెట్టుబడి అందించడం జరుగుతుంది.

 సొంత ఇల్లు లేని వారు మరియు ఇంటి స్థలం కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తును మరియు సంబదిత పత్రాలను సరిచూసినా తరువాత ఒకవేళ అర్హులని భావించిన ఎడల అర్హుల జాబితాలో పేరును ప్రకటించడం జరుగుతుంది. పేరు ప్రకటించిన 15 నుంచి 30 రోజుల వ్యవధిలో మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజున జమ చేయడం జరుగుతుంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ లాభాలు 

 • గృహలక్ష్మి పథకం (Gruhalakshmi Scheme Telangana In Telugu)అనేది తెలంగాణ ప్రభుత్వ  ముఖ్య మంత్రి కేసీఆర్ మహిళలకు సొంత ఇంటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది
 • గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు వారి యొక్క దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది 
 •  గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme Telangana In Telugu) ద్వారా లబ్ధిదారులకు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేసిన మొదటి వారానికి లక్ష రూపాయలు మీ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది
 •  మీ ఇంటి యొక్క బేస్మెంట్ నిర్మించిన తరువాత రెండవ ఇన్స్టాల్మెంట్ గా మరొక లక్ష రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
 • మీ ఇంటి యొక్క రూఫ్ నిర్మించిన తర్వాత మూడవ ఇన్స్టాల్మెంట్ గా మరొక లక్ష రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
 •  ఈ విధంగా మూడు లక్షల రూపాయలు మూడు విడతలుగా మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వం అందించినటువంటి సొమ్ము కేవలము గృహ నిర్మాణానికి మాత్రమే ఉపయోగించడానికి వీలు పడుతుంది.
 • గృహ లక్ష్మీ పథకం(Gruhalakshmi Scheme Telangana In Telugu) ద్వారా మహిళలు మరియు వారి యొక్క పిల్లలకు నివాస యోగ్యమైన ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి పెట్టుబడి సహాయం ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ అర్హతలు

 •  తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళ ఉండాలి
 • పెళ్లయిన మహిళ లేదా భర్త చనిపోయిన మహిళ లేదా ఒంటరి మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు
 •  మహిళ పేరుమీద సొంత ఇంటి స్థలం ఉండాలి
 •  మహిళ ఖచ్చితంగా రేషన్ కార్డును కలిగి ఉండాలి
 • బ్యాంకు ఖాతా అనేది ప్రభుత్వ బ్యాంకులో మాత్రమే కలిగి ఉండాలి మరియు అకౌంట్ సేవింగ్ అకౌంట్ అయి ఉండాలి 
 •  మహిళ యొక్క ఇంటి స్థలము మరియు రేషన్ కార్డులో అడ్రసు ఒకే ఏరియాకు చెందినవై ఉండాలి  అనగా ఇంటి స్థలము మంచిర్యాలలో ఉండి రేషన్ కార్డు అడ్రస్ గోదావరిఖనిలో ఉంటే  వారు ఈ పథకానికి అర్హులు కాదు 
 • ఒకవేళ మీకు ముందే కాంక్రీట్ స్లాబ్ ఉన్న ఇల్లు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు కారు 

గృహలక్ష్మి పథకం తెలంగాణ డాకుమెంట్స్ 

 • ఇంటి స్థలం పట్టా కాగితం(మహిళ పేరు మీద ఉండాలి)
 •   రేషన్ కార్డు
 •  ఆధార్ కార్డు
 •  మహిళ యొక్క బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ 
 • మొబైల్ నెంబర్
 • రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ 

గమనిక – ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు లో ఉన్న ఇంటి అడ్రసు మరియు ఇంటి స్థలం యొక్క ఏరియా  ఒకే మండలంలో ఉండాలి లేదా ఒకే ఊర్లో ఉండాలి 

గృహలక్ష్మి పథకం తెలంగాణ ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ

గృహలక్ష్మి పథకం తెలంగాణ(Gruhalakshmi Scheme Telangana In Telugu) ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ 10 ,2023 .కానీ ఇదే చివరి తేదీ కాదు మొదటి విడతగా లబ్ధిదారుల ఎంపికకు ఇది చివరి తేదీ దీని తర్వాత మరల గృహలక్ష్మి  పథకానికి అర్హత చేసుకోవడానికి దరఖాస్తు తేదీని మళ్లీ ప్రకటించడం జరుగుతుంది 

గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం | గృహలక్ష్మి అప్లికేషన్

గృహ లక్ష్మీ పథకానికి(Gruhalakshmi Scheme Telangana In Telugu) సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంలో పిడిఎఫ్ రూపంలో ఇక్కడ అందించడం జరుగుతుంది ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఇక్కడ చూడవచ్చు 

గృహలక్ష్మి అప్లికేషన్

గృహలక్ష్మి పథకం తెలంగాణ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా 

 • గృహ లక్ష్మీ పథకాన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ప్రస్తుతానికి లేదు ఇది ఇంకా పరిశీలన దశలోనే ఉంది
 •  గృహలక్ష్మి పథకానికి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
 •  అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ లో మీ పేరు మరియు మీయొక్క వయస్సు , మీ తండ్రి లేదా భర్త పేరు, కులము, మరియు మీ యొక్క ప్రస్తుత చిరునామాను విధిగా రాయవలసి ఉంటుంది
 •  తర్వాత మీయొక్క బ్యాంకు అకౌంట్ నెంబరు మరియొక మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు మీ యొక్క రేషన్ కార్డు నెంబరు మీకు ఎటువంటి అంగవైకల్యం ఉన్న దాని యొక్క వివరాలు మరియు మీరు ఒంటరి మహిళల వితంతువా లేదా పెళ్లైన మహిళల అనేటువంటి వివరాలను కూడా రాయవలసి ఉంటుంది మరియు మీ యొక్క వార్షిక ఆదాయాన్ని కూడా రాయవలసి ఉంటుంది
 •  మీ సొంత ఇంటి స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు లేదా గ్రామ పంచాయతీలో రసీదు లేదా నోటరీ వంటి డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయవలసి ఉంటుంది
 •  మీరు అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత  దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ మరియు ఇంటి స్థలం సంబంధించినటువంటి డాక్యుమెంట్ మరియు బ్యాంకు ఖాతా పాసుబుక్ జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జతచేసి దరఖాస్తులు ఇవ్వవలసి ఉంటుంది
 •   ఈ దరఖాస్తు ఫారం ను మరియు డాక్యుమెంట్స్ ను మీ యొక్క తాసిల్దార్ ఆఫీస్ లో లేదా ఎంపీడీవో ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవడం జరుగుతుంది
 •  15 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో మీ దరఖాస్తులు పరిశీలించి ఒకవేళ మీరు అర్హులుగా భావించిన ఎడల మీకు మూడు లక్షల రూపాయలు మూడు విడతల్లో మీ మహిళ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది
 •  అప్లికేషన్ యొక్క స్టేటస్ను మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రూపంలో అందించడం జరుగుతుంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ లాగిన్ విధానం 

 • గృహలక్ష్మి పథకం తెలంగాణ(Gruhalakshmi Scheme Telangana In Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
 • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
 • అక్కడ యూసర్ నేమ్ ,పాస్ వర్డ్ మరియు captcha ఎంటర్ చేయాల్సి ఉంటుంది .
 • అలా ఎంటర్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది కన్పించడం జరుగుతుంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ అప్లికేషన్ డౌన్లోడ్ 

 • గృహలక్ష్మి పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
 • అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .
 • అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది 
 • దానిలోకి వెళ్లి అప్లికేషను ఫారం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 గృహలక్ష్మి పథకం తెలంగాణ అప్లికేషన్ డౌన్లోడ్ 

గృహలక్ష్మి పథకం తెలంగాణ అధికారిక వెబ్ సైట్ 

గృహలక్ష్మి పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్సైటు త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్ 

గృహలక్ష్మి పథకం తెలంగాణ కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 040 23225018 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

గృహలక్ష్మి పథకం తెలంగాణ F.A.Q

గృహలక్ష్మి పథకం తెలంగాణ ఎవరు మొదలు పెట్టారు ?

లక్ష్మీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టారు 

గృహలక్ష్మి పథకం తెలంగాణ ఎప్పుడు మొదలు పెట్టారు ? 

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 2023లో ప్రారంభించింది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ పథకానికి అర్హులు ఎవరు ?

బీసీ ఎస్సీ ఎస్టీ కి చెందిన మహిళలు

గృహలక్ష్మి పథకం తెలంగాణ పథకానికి ఎలా ధరఖాస్తు  చెయ్యాలి ?

లక్ష్మీ పథకానికి ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు విధానం అమల్లో ఉంది ఆన్లైన్లో ప్రక్రియ అనేది ఇంకా వెరిఫికేషన్ దశలోనే ఉంది 

గృహలక్ష్మి పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

గృహలక్ష్మి పథకం తెలంగాణ యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది

 Other Schemes

Leave a Comment