వికలాంగుల యూడీఐడీ కార్డు (Handicapped UDID Card in Telugu) , అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్ అప్లికేషన్ ,అప్ ,వికలాంగుల యూడీఐడీ కార్డు పథకం దరఖాస్తు,వికలాంగుల యూడీఐడీ కార్డు అప్లికేషన్,వికలాంగుల యూడీఐడీ కార్డు పథకం దరఖాస్తు ఫారం,దరఖాస్తు చివరి తేదీ (Handicapped UDID Card in Telugu) (eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations)
భారత ప్రభుత్వం వికలాంగుల కోసంప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందించడం జరిగింది కార్డుని యు డి ఐ డి కార్డుగా పిలవడం జరుగుతుంది దేశంలో వివిధ రాష్ట్రాలలో వికలాంగులకు వివిధ రకాల గుర్తింపు కార్డులను ఆయా ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది . అందువల్ల దేశం మొత్తం వికలాంగులకు ఒకే గుర్తింపు కార్డు కోసం ఈ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది.ఈ కార్డును వికలాంగుల యొక్క ఆధార్ కార్డుగా మనం అభివర్ణించవచ్చు
వికలాంగుల యూడీఐడీ కార్డు కు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమిటి మరియు వికలాంగుల యూడీఐడీ కార్డు కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలను ఈ ఆర్థికల్లో వివరించడం జరిగింది
వికలాంగుల యూడీఐడీ కార్డు వివరాలు (Handicapped UDID Card in Telugu)
పథకం | వికలాంగుల ఐడి కార్డు (Handicapped UDID Card in Telugu) |
పథకం నిర్వహణ | భారత ప్రభుత్వం |
లబ్దిదారులు | దివ్యంగులు |
ఉద్దేశ్యం | గుర్తింపు కార్డు |
అప్లికేషను | ఆన్లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 91-93549-39703 |
వికలాంగుల యూడీఐడీ కార్డు ఉదేశ్యం
యూ డి ఐ డి కార్డు(Handicapped UDID Card in Telugu) ద్వారా వికలాంగుల దేశంలో ఎక్కడ జరిగింది ఐడి కార్డుగా ఉపయోగించవచ్చు .మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి వివిధ రకాల పథకాల్లో ఈ కార్డులు ఉపయోగించవచ్చు
వికలాంగుల యూడీఐడీ కార్డు లాభాలు
- వికలాంగుల యూడీఐడీ కార్డు(Handicapped UDID Card in Telugu) లోపల సంక్షిప్త సమాచారం బార్ కోడ్ లో నిక్షిప్తం చెయ్యబడుతుంది దిని ద్వారా దేశం లో ఎక్కడికి వెళ్ళిన వివిధ పత్రాలను తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు
- త్వరలో దేశస్థాయి నుంచి ,రాష్ట్ర స్థాయి ,జిల్లా స్థాయి మరియు మండల స్థాయి వరకు వర్తించే అన్ని స్కీం లలో ఈ కార్డు ను వికలాంగ గుర్తింపు కార్డు గా ప్రవేశపెట్టడం జరుగుతుంది
- ఈ విధం గా వికలాంగులు దేశం మొత్తం ఒకే కార్డు ను ఉపయోగించడం వల్ల వికలాంగ గణన సులభతరం అవుతుంది
- త్వరలో రైల్వే మరియు బస్సు పాస్ వంటి సంస్థలలో మరియు పెన్షన్ జారి కోసం కూడా ఈ కార్డు ను తప్పనిసరి చెయ్యనున్నారు
వికలాంగుల యూడీఐడీ కార్డు అర్హతలు
- శారీరక వైకల్యం కలిగిన వారు ( ఎస్కార్ట్ లేకుండా ప్రయాణము చేయలేనివారు)
- కుష్టు వ్యాధి ఉన్నవారు
- కాళ్లలో చేతుల్లో స్పర్శను కోల్పోయిన వారు మరియు కళ్ళలో కదలిక లేనివారు
- సెరిబ్రల్ ప్రాల్సి
- మరుగుజ్జు తనం ఉన్నవారు
- యాసిడ్ బాధితులు
- మస్కులర్ డిస్ట్రోఫీ
- అంధులు ( పూర్తిగా చూపు లేనివారు మరియు లో విజన్ ఉన్నవారు కూడా)
- మానసిక వైకల్యం కలిగిన వారు( ఎస్కార్ట్ లేకుండా ప్రయాణము చేయలేనివారు)
- ఆటిజం
- లెర్నింగ్ డిసబిలిటిస్ ఉన్న వారు
- మెంటల్ బిహేవియర్ ఉన్నవారు
- నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు
- రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న
- హిమఫలియా
- తల సేమియా
- సికెల్ సెల్ డిసీస్
- చెవిటి మూగ వంటి వైకల్యం కలిగిన వారు
వికలాంగుల యూడీఐడీ కార్డు డాకుమెంట్స్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- మీ యొక్క సంతకం ఫోటో
- ఆధార్ కార్డ్
- సదరన్ సర్టిఫికెట్ లేదా డాక్టర్ చే ధ్రువీకరింపబడిన వికలాంగ సర్టిఫికెట్
ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఈ డాక్యుమెంట్స్ యొక్క పిడిఎఫ్ ఫామ్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది pdf size 50 kb లకు మించరాదు
వికలాంగుల యూడీఐడీ కార్డు పొందడం ఎలా (How to Get Handicapped UDID Card In Telugu)
వికలాంగుల యూడీఐడీ కార్డు(Handicapped UDID Card in Telugu) పొందడానికి యు డి ఐ డి కార్డు అధికారిక వెబ్సైటుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసుకున్న తరువాత మీ యొక్క వివరాలు పరిశీలించి మీకు కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది ఆ కార్డును కూడా అధికార వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది
- ఒకవేళ మీకు వికలాంగ సర్టిఫికెట్ ఉన్నట్లయితే దరఖాస్తు సమయం లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- ఒకవేళ మీకు వికలాంగ సర్టిఫికెట్ లేనట్లయితే దరఖాస్తు ఫారంలో వివరాలు నింపవలసి ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను ఈ క్రింద వివరించడం జరిగింది. ప్రతి స్టెప్ ను ఫాలో అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు
Handicapped UDID Card In Telugu Apply Online (వికలాంగుల యూడీఐడీ కార్డు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా )
- దివ్యాంగ యూడీఐడీ(Udid Card ) కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది
- రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి ధరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది
- మీకు కనిపించిన దరఖాస్తు ఫారం లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ,డిసేబిలిటి డీటెయిల్స్ ,ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ మరియు ఐడెన్టిటి డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది
- పర్సనల్ డీటెయిల్స్ లో దివ్యాంగుని పేరు మరియు అతని తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా దివ్యాంగుడు ఏ కేటగిరి చెందినవాడు తప్పనిసరిగా నింపవలసి ఉంటుంది. అదేవిధంగా అతని యొక్క కేర్ టేకర్ యొక్క వివరాలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. వాటితో పాటు దివ్యంగుని యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ కాపీలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది
- డిసేబిలిటి డీటెయిల్స్ లో మీకు ఒకవేళ సదరన్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి తరువాత సదరన్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి మరియు సర్టిఫికెట్ ఇష్యూ చేసిన తేదీ మరియు డాక్టర్ యొక్క వివరాలను నింపవలసి ఉంటుంది
- ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ లో మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా నిరుద్యోగ అనే వివరాలు మరియు మీ యొక్క రేషన్ కార్డు వివరాలు మరియు మీ యొక్క సంవత్సర ఆదాయం యొక్క వివరాలు నింపవలసి ఉంటుంది
- ఐడెన్టిటి డీటెయిల్స్ లో మీయొక్క ఫోటో ఐడి కార్డ్ ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ వంటి వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- పై వివరాలు అన్ని నింపిన తర్వాత ఒకసారి సరిచూసుకొని ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది
- మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ కి వెళ్లడం జరుగుతుంది
- అప్లికేషన్ యొక్క వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది
- ఒకవేళ మీ యొక్క వివరాలు సరియైనవిగా తోచిన యెడల 30 నుంచి 60 రోజుల్లో మీ యొక్క కార్డు అంగన్వాడీ కేంద్రం ద్వారా మీకు చేరడం జరుగుతుంది లేదా పోస్టులో రావడం జరుగుతుంది లేదా పంచాయతీ కార్యాలయం ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది
వికలాంగుల యూడీఐడీ కార్డు అప్లికేషన్ స్టేటస్
- వికలాంగుల యూడీఐడీ కార్డు(Handicapped UDID Card in Telugu) యొక్క అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి
- హోమ్ పానల్లో లాస్ట్ యు డి ఐ డి కార్డు ట్రాక్ యువర్ అప్లికేషను అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
- అక్కడ ట్రాక్ అప్లికేషన్ పానల్ కనిపిస్తుంది .
- అక్కడ యు డి ఐ డి కార్డు నెంబర్ లేదా ఆధార్ కార్డ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది
- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ యొక్క స్థితి చూపించడం జరుగుతుంది
యూడీఐడీ కార్డు అప్లికేషన్ స్టేటస్ లింక్
వికలాంగుల యూడీఐడీ కార్డు డౌన్లోడ్ (Handicapped UDID Card In Telugu Download)
- యూ డి ఐ డి యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి
- హోమ్ పానల్లో లాస్ట్ యు డి ఐ డి కార్డు ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
- అక్కడ లాగిన్ పానల్ కనిపిస్తుంది .మీ యొక్క యు డి ఐ డి నెంబర్ లేదా దరఖాస్తు ఫారం యొక్క రిఫరెన్స్ నెంబర్ను ఎంటర్ చేయాలి మరియు మీ యొక్క పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
- అధికారిక వెబ్సైటు లో డౌన్లోడ్ పానల్ కనిపిస్తుంది
- దానిలోకి వెళ్లి ప్రింట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
వికలాంగుల UDID కార్డు డౌన్లోడ్
యూడీఐడీ కార్డు పోగొట్టుకున్న వారు
ఒకవేళ మీ యొక్క యు డి ఐ డి కార్డు (Handicapped UDID Card in Telugu ) పోగొట్టుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తిరిగి పొందవచ్చు
- యూ డి ఐ డి యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి
- హోమ్ పానల్లో లాస్ట్ యు డి ఐ డి కార్డు లాస్ట్ కార్డు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
- మీ యొక్క యు డి ఐ డి కార్డు యొక్క నెంబర్ మరియు ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
- మరియు మీ యొక్క పుట్టిన తేదీ వివరాలను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
ఈ విధంగా చేసిన తరువాత మీ యొక్క వివరాలన్నీ సరి చూసి మీ యొక్క కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది
యూడీఐడీ కార్డు పోగొట్టుకున్న వారు
యూడీఐడీ కార్డు రేనువల్
- యూ డి ఐ డి యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి
- హోమ్ పానల్లో లాస్ట్ యు డి ఐ డి కార్డు రేనువల్అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది
యు డి ఐ డి కార్డు టెంపరరీగా పొందినటువంటి వారు వారి యొక్క కార్డును రెన్యువల్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే క్రింది వివరాలను నింపి అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది
యూడీఐడీ కార్డు రేనువల్ ఫారం లింక్
వికలాంగుల యూడీఐడీ కార్డు అధికారిక వెబ్ సైట్
వికలాంగుల యూడీఐడీ కార్డు యొక్క అధికారిక వెబ్సైటు ఈ క్అరింద టేబుల్ప్డే లో ఇవ్ట్వడం జరిగింది చేయడం జరుగుతుంది
వికలాంగుల యూడీఐడీ కార్డు హెల్ప్ లైన్ నెంబర్
వికలాంగుల యూడీఐడీ కార్డు కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 91-93549-39703 ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
అధికారిక వెబ్సైటు | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
వికలాంగుల యూడీఐడీ కార్డు F.A.Q
వికలాంగుల యూడీఐడీ కార్డు కి అర్హులు ఎవరు ?
దివ్యాంగులు
వికలాంగుల యూడీఐడీ కార్డు కి ఎలా ధరఖాస్తు చెయ్యాలి ?
దివ్యాంగుల యూడీఐడీ కార్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు
వికలాంగుల యూడీఐడీ కార్డు యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?
వికలాంగుల యూడీఐడీ కార్డు యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది
Other Articles